వాటర్ బోర్డు ఉద్యోగుల అభ్యున్నతికి కృషి : ఐఎన్‌‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి

వాటర్ బోర్డు ఉద్యోగుల అభ్యున్నతికి కృషి : ఐఎన్‌‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి

బషీర్​బాగ్, వెలుగు: మెట్రో వాటర్ వర్క్స్, సీవరేజ్ బోర్డు ఉద్యోగుల అభ్యున్నతికి సీఎం రేవంత్​రెడ్డి కృషి చేస్తున్నారని ఐఎన్‌‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జలమండలి కామ్​గార్‌‌ యూనియన్‌‌ అధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి అన్నారు. జలమండలిలో ఇటీవల పదవీ విరమణ చేసిన, ప్రమోషన్లు పొందిన ఉద్యోగులు బుధవారం రాజి రెడ్డిని హైదరాబాద్​లో సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గత  పదేండ్లుగా పెండింగ్‌‌లో ఉన్న  క్యూఏటీ పోస్టుల ప్రమోషన్లను ప్రభుత్వంతో చర్చించి ఆర్డర్లు జారీ చేయించినట్లు తెలిపారు.

ఉద్యోగ సమస్యలపై అవగాహన కలిగిన బలమైన యూనియన్ వల్లే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. త్వరలో జలమండలి ఉద్యోగులకు రూ. 10 లక్షల విలువైన ప్రభుత్వ హెల్త్ కార్డు, అడ్మినిస్ట్రేషన్ ఎఫ్ఏ/పీఏ పోస్టుల అప్‌‌గ్రేడ్ , ప్రమోషన్లు ఇప్పిస్తామన్నారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి సి.హెచ్ సురేశ్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కె. రామరాజు, నాయకులు కె. రమణా రెడ్డి, రఘునాథ్, నరేందర్, వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు.